ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు చాలా దారుణంగా పెరిగిపోతుంది. ఈ వైరస్ నివారణకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఖఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వైరస్ వ్యాపిస్తుండడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కాగా ఈ పెరిగిన కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 603 కు చేరుకుందని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో దాదాపుగా 15 మంది మరణించగా, 42 మంది పూర్తిగా కోలుకున్నారని తెలిపారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వివరాల ప్రకారం… కర్నూలులో అత్యధికంగా 129 కేసులు, గుంటూరు జిల్లాలో కూడా అత్యధికంగా 126 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక తరువాత స్థానంలో నెల్లూరులో 67 కేసులు, ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇకపోతే ఇప్పటికినమోదైన కేసుల్లో కొందరు ఇప్పటికి పూర్తిగా కోలుకుంటున్నారని, వారందరిని కూడా త్వరలోనే ఆసుపత్రి నుండి డీఛార్జి చేస్తామని వైద్యాధికారులు వెల్లడించారు.