నాగ చైతన్య తో సినిమా చేయాలనుకుంటున్న డైరెక్టర్

నాగ చైతన్య తో సినిమా చేయాలనుకుంటున్న డైరెక్టర్

విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ మోహన కృష్ణ ఇంద్రగంటి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తాను తాజాగా చిత్రీకరించిన వి సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. న్యాచురల్ స్టార్ నాని మరియు సుదీర్ బాబు లతో వి చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ అమలు ఉంది. అయితే ఈ లాక్ డౌన్ అనంతరం చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రం తర్వాత మరో చిత్రాన్ని ప్రకటించాలని భావించారు. అయినప్పటికీ అది కుదరలేదు. అయితే ఈ దర్శకుడు అక్కినేని నాగ చైతన్య తో సినిమా చేసేందుకు ఉవ్విళ్లరుతునట్లు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య కి జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. అయితే ఈ చిత్రం అనంతరం మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో నాగ చైతన్య సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే నాగ చైతన్య ఇప్పటివరకు చేయని కథతో ముందుకు వచ్చే అవకాశం ఉంది. బిన్న దర్శకత్వం ప్రతిభ తో ఆకట్టుకున్న ఈ దర్శకుడు నాగ చైతన్య ను ఎలా చూపిస్తారో అం టూ అభిమానులు ఇప్పటి నుండే ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.