నాగ చైతన్య మొదటి భార్య గురించి నిజాలు బయట పెట్టేసిన సమంత

నాగ చైతన్య మొదటి భార్య గురించి నిజాలు బయట పెట్టేసిన సమంత

మంచు లక్ష్మి ఒక ప్రముఖ ఛానల్ కోసం నిర్వహిస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్ కార్యక్రమం ప్రారంభం అయిందిఈ షో చేయడం కోసం నైట్ డ్రెస్‌లో రావాలని చెపితే కొందరు షాక్ అయ్యారని.. మరికొందరైతే ఉత్సాహం చూపించారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇలాంటి షోలు నార్త్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయన్నారు.

ఈ షోని ముందుగా తనకు తెలిసిన సెలబ్రిటీలతో మొదలుపెట్టినట్లు.. అందరినీ ఈ షోలో కలుసుకోవాలనుందని చెప్పింది. ప్రత్యేకంగా ఎవరిష్టమని అడిగితే.. చెప్పలేనని.. రానాని మాత్రం బాగా మిస్ అవుతున్నట్లు మంచు లక్ష్మీ వెల్లడించింది.
ఇకపోతే  షోలో భాగంగా మంచు లక్ష్మి సమంతతో తన షోను ప్రారంభించింది. చైతన్యతో ప్రేమ ఆపై పెళ్ళికి సంబంధించి చాలామందికి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పమని మంచులక్ష్మి సమంతను అడిగింది. దీనితో నవ్వుతూ సమంత చైతూకి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసింది. చైతూకు మొదటి భార్య వుందని షాకిచ్చింది. తనకంటే తన పడకపై వున్న పిల్లోస్ అంటేనే చైతూకు చాలా ఇష్టమని చెప్పింది.
అంతేకాదు బయటకు ఎంతో కూల్‌గా కనిపించే చైతన్యకు పిల్లలంటే చాలా ఇష్టమని, పెట్స్ అంటే కూడా బాగా ఇష్టపడతాడని చెప్పింది. చైతన్యతో తనకున్న ప్రేమకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఈ షోలో సమంత మంచు లక్ష్మితో షేర్ చేసింది.