రానా కి నో చెప్పిన ‘మహానటి’

రానా కి నో చెప్పిన 'మహానటి'

ఇటీవ‌ల విదేశాల నుంచి ఇండియాకి వ‌చ్చిన రానా ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న సినిమాలపై దృష్టి పెట్టాడు. రానా హీరోగా ఒక సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది.

మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ, ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అట. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను తీసుకున్నది రానానే. ఆయన జోడీగా న‌టించేందుకు కీర్తి సురేష్‌‌ను సంప్రదించార‌ట‌. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్‌కి విపరీతమైన క్రేజ్ వుంది. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు వరుస విజయాలను సాధిస్తూ రావడంతో ఆమె క్రేజ్ పెరుగుతూ వెళ్లింది.
మహానటి చిత్రానికి ముందు గ్లామర్ పరంగానే యూత్‌ను ఆకట్టుకున్న ఆమె, ఆ తరువాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. అందుక‌నే రానా స‌ర‌స‌న న‌టించ‌మ‌ని అడిగితే ఆమె నో చెప్పి షాక్ ఇచ్చింద‌ట‌. దీనికి కారణం.. ఆమెకు కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు అయ్యుండకపోవడమా? అన్నది తెలియరాలేదు. దీంతో ఇప్పుడు నందినీ రెడ్డి మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తుంద‌ట‌. మ‌రి… రానా స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ఎవ‌రికీ వ‌స్తుందో చూడాలి.