ఆస్కార్ కు ఎంపికైన భారతీయ చిత్రాల్లో రౌడీ హీరో సినిమా

ఆస్కార్ కు ఎంపికైన భారతీయ చిత్రాల్లో రౌడీ హీరో సినిమా

2019 ఆస్కార్ కు ఎంపికైన 28 భారతీయ చిత్రాల్లో ‘డియర్ కామ్రేడ్’ కూడా ఉండటం విశేషం. దీనితో పాటు ఇతర భాషల నుంచి కూడా పలు చిత్రాలు నామినేషన్ కేటగిరీలో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే తెలుగు సినీపరిశ్రమ నుంచి బరిలో నిలిచింది రౌడీ గారి సినిమా మాత్రమేనన్నది బిగ్ సర్ ప్రైజ్.భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. అయితే ఇందులో ఆస్కార్‌కు నామినేట్ అయ్యేంతగా ఏముందనేది పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం. సినిమాలో కథ పెద్దగా లేదు. హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం, ఆ తర్వాత ఏదో కారణం వల్ల విడిపోవడం, కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఒకటవడం.

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ఎంట్రీస్ కి మన తెలుగు సినిమా ఎంపికైనందుకు  రౌడీ అబిమనులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు  . ప్రస్తుతానికి విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఇండియా తరపున 28 సినిమాల జాబితా లో డియర్ కామ్రేడ్ ఒకటిగా ఉంది.మన పరిశ్రమ నుంచి ఈ సినిమా స్థానం సంపాదించడం అభిమానుల్లో ఆనందం నింపుతోంది. అయితే ఆ జాబితాలో 2019 బెస్ట్ హిట్ సాధించిన సినిమాలెన్నో ఉన్నాయి.

రౌడీ ఫ్యాన్స్ కి ఇది ఊహించని సర్ ప్రైజ్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఆస్కార్ అవార్డుల్ని ప్రకటిస్తుంటారు. 2020 ఫిబ్రవరిలో ప్రకటించే ఆస్కార్ లలో మన దేశం తరపున ఏ సినిమా పురస్కారం దక్కించుకుంటుంది అన్నది వేచి చూడాల్సిందే.