వరద బాదితులకు ముఖ్యమంత్రి జగన్ సహాయం : తెలంగాణా సి.ఎం తో చర్చలు

వరద బాదితులకు ముఖ్యమంత్రి జగన్ సహాయం : తెలంగాణా సి.ఎం తో చర్చలు

ముఖ్యమంత్రి జగన్ నంద్యాలలో వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసారు. వరదల కారణంగా జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులుందరికి ఇళ్లు కట్టిస్తామని జగన్‌ స్పష్టం చేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేసారు.

నాలుగు రోజులుగా అక్కడ నెలకొన్ని పరిస్థితి పైన ఆరా తీసారు. జిల్లా అధికారులతో..ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో వరద ప్రాంతాలను సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రాయలసీమలో ఈ స్థాయి వర్షాలను ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు.

వరద బాధితుల పట్ల అధికారులు మానవత్వం చూపాలని జగన్ సూచించారు. కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్‌ తెలిపారు. భవిష్యత్తులో రాయలసీమలోని ప్రతి డ్యామును నీటితో నింపుతామన్నారు.
నంద్యాల డివిజన్‌లోని 17 మండలాల్లో నష్టం జరిగిందని స్పష్టం చేశారు. 43 వేల హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. రూ.784 కోట్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వరదలు రాకుండా కలెక్టర్లు శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.2 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. వరద బాధితులకు గతం కంటే 15శాతం అదనంగా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.