పాన్ ఇండియన్ చిత్రాల్లో మొదటి స్థానంలో ఉన్న “కేజీయఫ్ చాప్టర్ 2”

పాన్ ఇండియన్ చిత్రాల్లో మొదటి స్థానంలో ఉన్న “కేజీయఫ్ చాప్టర్ 2”

ఇండియన్ బాక్సాఫీస్ పైకి భారీ అంచనాలతో దండెత్తడానికి సిద్ధంగా ఉన్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదల కోసం ఇప్పుడు యావత్తు భారతదేశమే ఎదురు చూస్తుంది.కేవలం ఒక్క భాషలనే కాకుండా దీని మొదటి భాగం విడుదల కాబడిన అన్ని భాషల ప్రజలు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ చిత్రాన్ని ఒక చరిత్రలా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.ఇలా తెరకెక్కించిన ఈ చిత్రానికి చూసిన ప్రేక్షకుల్లో ఒక బలమైన ముద్ర పడిపోయింది.

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అయితే ఈ చిత్రానికి గుడి కట్టించేయమన్నా కట్టించేస్తారు.ఆ రేంజ్ లో ఈ సినిమాను వారు ఓన్ చేసుకున్నారు.అయితే ఇప్పుడు రాబోతున్న “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారంటే ఇంకా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకముందే భారతదేశంలోనే చరిత్ర సృష్టించింది అని యష్ బాస్ అభిమానులు అంటున్నారు.ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ విడుదల కావడానికి ఇంకో రోజు వ్యవధి ఉండగా ఈలోపలే బుక్ మై షో లో లక్ష మందికి పైగా ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.ఇది నిజంగా ఒక చరిత్ర సృష్టించే రికార్డే అని చెప్పాలి.ప్రస్తుతం మరో రెండు రోజుల్లో నరాచికి తలుపులు తెరుచుకుంటాయి అని విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.