సీఎం జగన్ ప్రకటన పట్ల భిన్నాభిప్రాయాలు

సీఎం జగన్ ప్రకటన పట్ల భినాభిప్రాయలు

ఏపీలో వైసీపీ అధికారాన్ని చేపట్టిన ఆరు నెలలలోనే జగన్ పాలనపై భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి ఓటు వేసి మోసపోయామని వైసీపీ రైతులు బాధపడుతున్నారు. నేడు తుళ్లూరులో రాజధాని రైతులతో సమావేశమైన వైసీపీ రైతులు జగన్ నిర్ణయంపై మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానులు కావాలన్న జగన్ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, వికేంద్రికరణ జరగాలని అన్న సీఎం జగన్ ప్రకటన పట్ల భినాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రతిపక్ష నేతలు మద్ధతు తెలుపుతుంటే, కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. రాజధాని కోసం రైతులు భూములను త్యాగం చేశారని ఇప్పుడు రాజధాని మార్పు చేస్తే వారు దారుణంగా నష్టపోతారని ఐక్యంగా పోరాటం చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. 3 రాజధానుల ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని లేదంటే రేపటి నుంచి తమ పోరాటాన్ని మరింత ఉదృత్తం చేస్తామని అన్నారు.