మూడు రాజధానుల నిర్ణయం పై కిషన్ రెడ్డి అభిప్రాయం

మూడు రాజధానుల నిర్ణయం పై కిషన్ రెడ్డి అభిప్రాయం

అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అమరావతిని రాజధాని గా విశాఖకు తరలిస్తున్నారని రైతులు ఆందోళనతో నిరసనలు, ధర్నాలు, ర్యాలీ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఎంతగా కంట్రోల్ చేసినప్పటికీ నిరసనలు, ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తూనే వున్నారు అమరావతి వాసులు. అయితే ఈ క్రమంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళనల ఫై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ని వివరాలు కోరారు. శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డీజీపీ కి సూచించడం జరిగింది.

ఇటీవల అమరావతి రాజధాని పైన, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయం పైన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్ణయం వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అని, కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోదు అని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సహా వైసీపీ మంత్రులు, నేతలు మూడు రాజధానుల నిర్ణయానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. రాజధాని అంశం ఫై ముఖ్యమంతి జగన్ నిర్ణయం తీసుకున్నాకే తాను స్పందిస్తానని కిషన్ రెడ్డి ఇదివరకే తెలిపారు.