ప‌రి చిత్ర పోస్ట‌ర్ చూడ‌డంవ‌ల్లే కోహ్లీ సేన ఓడిపోయింది…!

Kohli Lost Test Match After Watching Pari Movie Poster

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య‌గా మారాక అనుష్క‌శ‌ర్మ  తొలి చిత్రం విడుదల‌కు సిద్ద‌మ‌వుతోంది. ప‌రి అనే చిత్రంలో అనుష్క న‌టించి, నిర్మించింది. పెళ్లి త‌ర్వాత భర్త‌తో క‌లిసి ద‌క్షిణాఫ్రికా వెళ్లిన అనుష్క అక్క‌డి నుంచి తిరిగి వ‌చ్చి షూటింగుల్లో పాల్గొంటోంది. జీరో చిత్ర షూటింగ్ లో పాల్గొంటూనే ప‌రి చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తోంది. ఇందులో భాగంగా చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేసింది అనుష్క‌. టీజ‌ర్ లో అనుష్క గెటప్ చూడ‌గానే భ‌యం క‌లిగించే విధంగా ఉంది. దీంతో ఈ టీజ‌ర్ కి విరాట్ ను అనుసంధానిస్తూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. అనుష్క అందానికి క్లీన్ బౌల్డ్ అయిన విరాట్ ప‌రిలో ఆమెను చూసి బెదిరిపోయాడ‌ని అంటున్నారు. అంత‌టితో ఆగ‌కుండా విరాట్ ముఖాన్ని పోస్ట‌ర్ లో క‌లిపి ఫ‌న్నీ ఫొటోలు కూడా సృష్టిస్తున్నారు. హోలీ సంద‌ర్భంగా విడుద‌ల కానున్న ప‌రి టీజ‌ర్ ను  హోలీ విత్ ప‌రి అన్న ట్యాగ్ లైన్ తో ట్రెండ్ చేశారు. త‌ర్వాత దీన్నినెటిజ‌న్లు కోహ్లీ విత్ ప‌రిగా మార్చి స‌ర‌దా కామెంట్లుచేస్తున్నారు. ఇంకొంద‌రు నెటిజ‌న్ల‌యితే మ‌రింత సిల్లీగా కామెంట్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో మొద‌టి టెస్ట్ మ్యాచ్ కు ముందు అనుష్క కోహ్లీకి ఈ పోస్ట‌ర్ చూపించిందని, అందుకే మ్యాచ్ లో కోహ్లీ సేన ఓట‌మి పాల‌యింద‌ని సెటైర్లు వేస్తున్నారు.