నాని “సరిపోదా శనివారం” నుంచి లేటెస్ట్ అప్డేట్.!

నాని “సరిపోదా శనివారం” నుంచి లేటెస్ట్ అప్డేట్.!
Cinema News

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు చేస్తున్న మరో సాలిడ్ ప్రాజెక్ట్ “సరిపోదా శనివారం” కోసం అందరికీ తెలిసిందే. మరి నాని చేసిన ఎన్నో వినూత్న ప్రాజెక్ట్ లలో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా ని ఒక క్రేజీ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా మేకర్స్ మరో సారి ఈ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. మరి ఈ మూవీ నుంచి ఇప్పుడు మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు.

ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూషన్ హక్కులని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర మూవీ స్ వారు కొనుగోలు చేసారని మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు తెలిపారు. దీనితో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో వారు రిలీజ్ చేయనున్నారని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో రీసెంట్ గానే టాలెంటెడ్ నటుడు దర్శకుడు ఎస్ జే సూర్య కూడా యాడ్ అయ్యిన సంగతి తెలిసిందే.