AP Politics: అంబేద్క‌ర్ పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని

AP Politics: Minister Vidadala Rajini made sensational comments on Ambedkar
AP Politics: Minister Vidadala Rajini made sensational comments on Ambedkar

అంబేద్క‌ర్ అంటే ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో ప‌రిమిత‌మైన వ్య‌క్తి కాద‌ని, విశ్వ‌మాన‌వుడు అంబేద్క‌ర్ అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. కొరిటెపాడు రోడ్డు చంద్ర‌మౌళిన‌గ‌ర్‌లోని గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు మాట్లాడుతూ విజ‌య‌వాడ‌లో జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం నిర్మించింది కేవ‌లం ఒక విగ్ర‌హాన్ని కాద‌ని, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల క‌ల‌ల‌ను సాకారం చేసే ఒక గొప్ప క‌ట్ట‌డాన్ని అని పేర్కొన్నారు. అంబేద్క‌ర్ స్మృతివ‌నం ఒక విప్ల‌వ‌మై నిలుస్తుంద‌ని తెలిపారు. అంబేద్క‌ర్ ప్ర‌తిపాదించిన సిద్ధాంతం విశ్వ‌మాన‌వాళికి ఉప‌యోగ‌ప‌డేదేన‌ని చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అణ‌గారిన జాతుల‌కు ఆశాదీపం అంబేద్క‌ర్ గారు అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్య‌క్తికి జ‌గ‌న‌న్న దేశంలోనే కనివిని ఎరుగ‌ని నివాళి అర్పిస్తున్నార‌ని, ఆయ‌న స్ఫూర్తి కొన‌సాగేలా అద్భుత కార్య‌క్ర‌మానికి న‌డుం బిగించార‌ని తెలిపారు.