TS Politics: దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

TS Politics: CM Revanth Reddy has finished his visit to Davos..
TS Politics: CM Revanth Reddy has finished his visit to Davos..

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. దావస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులలో భాగంగా రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గతేడదితో పోల్చుకుంటే దాదాపు ఇది రెండింతలు. ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్,వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, అదానీ గ్రూప్, JSW, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఓ9 సొల్యూషన్స్‌,BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్,క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలను కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలనీ అన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు యూరప్,అమెరికా దేశాలు పని చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.