“దేవర” సినిమా పై లేటెస్ట్ అప్డేట్.!

“దేవర” సినిమా పై లేటెస్ట్ అప్డేట్.!
Cinema News

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. మరి ఎన్టీఆర్ గత గ్లోబల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తర్వాత వస్తున్నా ఈ సినిమాపై ఇంటర్నేషనల్ ఆడియెన్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకొనగా ఫ్యాన్స్ కి ఇపుడు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

“దేవర” సినిమా పై లేటెస్ట్ అప్డేట్.!
Devara Cinema

కొరటాల అండ్ టీం అయితే నెవర్ బిఫోర్ స్కేల్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఒక లేటెస్ట్ అప్డేట్ సినిమాపై ఇపుడు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు మేకర్స్ తీస్తున్నారంట . అలాగే ఈ షెడ్యూల్ వారమంతా కొనసాగుతుంది అని తెలుస్తోంది .

అలాగే మేకర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడానికి ముందే పలు ప్రీ ప్లాన్ లు చేయడంతో షూటింగ్ కి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది అని తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమా కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.