“పుష్ప 2” లో స్పెషల్ సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ ..!

“పుష్ప 2” లో స్పెషల్ సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ ..!
Cinema News

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ మూవీ షూటింగ్ సహా మరిన్ని అంశాలపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా పార్ట్ లో మ్యూజిక్ అందులో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఐటెం నెంబర్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

“పుష్ప 2” లో స్పెషల్ సాంగ్ పై లేటెస్ట్ అప్ డేట్ ..!
Pushpa-2

ఇక ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఐటెం సాంగ్ ఉందని తెలిసిందే. అయితే ఈ సాంగ్ కోసం మళ్ళీ చాలామంది స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పేరు బాలీవుడ్ నుంచి బాగా వినిపిస్తుంది. మరి లేటెస్ట్ రూమర్స్ ప్రకారం పుష్ప 2 లో సాంగ్ కోసం దిశా పటాని పేరు వినిపించడం స్టార్ట్ అయ్యింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ మూవీ కి మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.