జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ ఇకలేరు..!

Heath Streak
Heath Streak

క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్ కన్నుమూశారు. జింబాబ్వే క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) క్యాన్సర్ తో కన్నుమూశారు. గతంలో జింబాబ్వే టీం బెస్ట్ బౌలర్ గా, కెప్టెన్ గా ఉన్న ఆయన…వన్డేల్లో 239 వికెట్లు,టెస్టుల్లో 216 వికెట్లు తీశారు.

స్ట్రీక్ జింబాబ్వే తరపున 100 టెస్ట్ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచారు …2005లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. జింబాబ్వే, బంగ్లాదేశ్, ఐపీఎల్ లో KKR టీమ్ కు కోచ్ గా వ్యవహరించారు. జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) క్యాన్సర్ తో మరణించడంపై క్రీడాకారులు నివాళులు అర్పిస్తున్నారు.