మరో బయోపిక్‌.. సందడి కొనసాగుతోంది

ప్రస్తుతం టాలీవుడ్‌లో అరడజనుకు పైగా బయోపిక్‌ు తెరకెక్కుతున్నాయి. అందులో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’, ఎన్టీ రామారావు జీవిత చరిత్రం ‘ఎన్టీఆర్‌’, రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’. ఈమూడు చిత్రాలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక ఈ చిత్రాలతో పాటు ఇంకా పలు బయోపిక్‌లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న బయోపిక్‌ల సందడి కొనసాగించేందుకు మరో బయోపిక్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరో బయోపిక్‌.. సందడి కొనసాగుతోంది - Telugu Bullet

గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సీహెచ్‌ రామారావు అనే దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కృష్ణ చైతన్య మరియు ఆయన భార్య మృదులాలు ఈ చిత్రంలో ఘంటసాల మరియు ఆయన భార్యల పాత్రల్లో కనిపించబోతున్నారు. ఘంటసాల సంగీతం నేర్చుకునే సమయంలో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి మరీ జీవనం సాగించేవాడు. అందుకే ఈ చిత్రంపై అందరు ఆసక్తిగా ఉన్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బయోపిక్‌లు వరుసగా వస్తున్న నేపథ్యంలో ఘంటసాల బయోపిక్‌పై కూడా ఆసక్తి రేకెత్తుతోంది.