వేరేవాళ్ళ పేజ్ లైక్ చేసిందని… ప్రియురాలి కనుగుడ్లు పీకేయబోయిన ప్రియుడు

Like someone else's page
ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియానే ఎక్కువ కాలం గడుపుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు తమతో ఎవరైనా మాట్లాడకపోతే కున్గిపోయేవారు ఇప్పుడు మాత్రం తమ పోస్టులకు లైకులు రాకపోయినా, ట్రోల్ చేసినా కుంగిపోవడం సాధారణమైపోయింది. కొందరైతే ఏకంగా దాడులకే దిగుతున్నారు. ఇందుకు యూకేలోని కెంట్‌లో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. వైట్‌స్టేబుల్‌లో నివసిస్తున్న బాడీ బిల్డర్ డానీ బ్రిడ్జెస్(35)కు తన ప్రియురాలితో అమానుషంగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్టును లైక్ చేసింది. ఈ విషయం తెలిసి డానీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నువ్వు వేరేవారి పేజ్‌ లైక్ చేయడం ఏమిటంటూ ఆమె కళ్లను బలవంతంగా పెకిలించేందుకు ప్రయత్నించాడు. అతడి ఉక్కు కౌగిలిలో ఉక్కిరిబిక్కిరైన ఆమె తప్పించుకోడానికి ఎంతో ప్రయత్నించింది. మొత్తానికి అతడి నుంచి తప్పించుకుని ఫ్రెండ్‌ కి రక్షించమని మెసేజ్ పంపింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తలుపులు తెరవకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలకొట్టి డానీని అదుపులోకి తీసుకున్నారు.