నిఖిల్…అసలు ఏమవుతోంది ?

what happening nikhil

యువ హీరోల్లో మంచి హిట్స్ తో ఫాంలో ఉన్న నిఖిల్ ఒకరు. అయితే ఈ యువ హీరో సినిమా రిలీజ్ చేసి చాలా కాలం అయింది. ఆయనకి అసలు ఈ మధ్య టైం బాగున్నట్టు లేదు. అయితే ముద్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూసినా వేరే సినిమా అదే పేరుతో రిలీజ్ కావడంతో వెనక్కి తగ్గాడు. పేరు మార్చుకుని అర్జున్ సురవరం పేరుతో విడుదలకు సిద్ధమైనా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కారణంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీ కానీ దేని మీద కానీ క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాతో పాటుగా మరో సినిమా కూడా చేశాడు నిఖిల్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ తో పాటుగా కాన్సెప్ట్ పోస్టర్ వదిలారు.శ్వాస అంటూ నిఖిల్ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. నిఖిల్ సరసన ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. కిషన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తేజ్, హరినికేష్ కలిసి నిర్మిస్తున్నారు. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం కథ, కథనాల విషయంలో దర్శక నిర్మాతలకు మధ్య వచ్చిన బేదాభిప్రాయాలతో శ్వాస సినిమా మధ్యలోనే ఆగిపోయిందని అంటున్నారు. ఇక మరో పక్క చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ ని ప్రకటించారు. ఆ సినిమా రెగ్యులర్ చిత్రీకరణకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.