పసికందుకు కరోనా పాజిటివ్‌

పసికందుకు కరోనా పాజిటివ్‌

ఐదు నెలల పసికందుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం 28 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్‌ వచి్చనట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

ఈ ముగ్గురిలో అయిదు నెలల పాప సైతం ఉంది. కరోనా థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.