‘లండన్‌ బాబులు’ ప్రివ్యూ

London Babulu Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   స్వాతి రెడ్డి, రక్షిత్

నిర్మాత: మారుతి   దాసరి 
దర్శకత్వం :  చిన్ని కృష్ణ 

మ్యూజిక్ : k

‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లు దక్కించుకుంటూ దూసుకు పోతున్న దర్శకుడు మారుతి. ఇటీవలే ఈయన ‘భలే భలే మగాడివోయ్‌’ మరియు ‘మహానుభావుడు’ చిత్రాలతో సూపర్‌ హిట్స్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇక దర్శకుడిగా పరిచయం అయినప్పటి నుండి కూడా మారుతి తన శిష్యులతో లేదా సన్నిహితలతో సినిమాను నిర్మిస్తూనే ఉన్నాడు. మారుతి టాకీస్‌ బ్యానర్‌లో ఇప్పటికే పలు సినిమాలను మారుతి నిర్మించి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని మారుతి నిర్మించాడు. మారుతి బ్రాండ్‌తో పాటు ఈ సినిమాలో అలీ మరియు స్వాతిలు నటించిన కారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

రక్షిత్‌ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా, కథ మరియు స్క్రీన్‌ప్లేను మారుతి ఈ చిత్రానికి అందించాడు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. చిన్ని కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది. మారుతి ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ చిత్రం పబ్లిసిటీ కోసం కళ్యాణ్‌ జ్వూవెలర్స్‌ యాడ్‌ను పేరడీ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న లండన్‌ బాబులు సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో మారుతి ఉన్నాడు. లండన్‌కు వెళ్లాలని ఆశపడే కుర్రాళ్ల కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అలీ మరియు సత్యల కాంబో సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.