లండన్‌ బాబులు… తెలుగు బులెట్ రివ్యూ

London Babulu Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   స్వాతి రెడ్డి, రక్షిత్

నిర్మాత: మారుతి   దాసరి
దర్శకత్వం :  చిన్ని కృష్ణ 

మ్యూజిక్ : K

తెలుగు సినిమాకి నిజంగా మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పుకునేందుకు కొత్తగా సరికొత్త కంటెంట్ తో కుర్రకారు చేస్తున్న ప్రయత్నాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. లండన్ బాబులు కూడా ఆ కోవలో వచ్చిన సినిమానే. నిజానికి ఇది తమిళ్ లో చేసిన అండవాన్ కట్టలై అనే సినిమాకు రీమేక్. దర్శకుడు మణికంఠన్, హీరో విజయ్ సేతుపతికి గొప్ప పేరు తెచ్చిన సినిమా. పోలిక వస్తుందన్న భయంతో లండన్ బాబులు సినిమా రీమేక్ అని చెప్పడడానికి దర్శకనిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దర్శకుడు మారుతి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం కొత్త కాకపోయినా కొత్త హీరోతో, ప్లాప్ దర్శకుడుతో సినిమా చేస్తూ కూడా ఈ సినిమా కి నిర్మాత కావడం గర్వంగా ఉందనడం లండన్ బాబులు కంటెంట్ మీద వున్న నమ్మకం. ఆ నమ్మకం నిజమైందా ? సినిమా చూసిన ప్రేక్షకులు ఏమి అనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

కథ…

విదేశాలు వెళ్లి భారీగా సంపాదించి డబ్బు కష్టాల నుంచి బయటపడాలని కలలు కనే ఓ కుర్ర గ్యాంగ్ లో సభ్యుడు గాంధీ ( రక్షిత్ ). లండన్ వెళ్ళాలి అనుకునే ఇతగాడి ఆశలకు వీసా రూపంలో అడ్డంకి ఎదురు అవుతుంది. పెళ్లికాని వాళ్ళు విదేశాలు వెళితే వెనక్కి రారన్న కారణంతోటే వీసా నిరాకరించారు అన్న విషయం అర్ధం చేసుకున్న గాంధీ ఆ సమస్య అధిగమించడానికి కొత్త ప్లాన్ వేస్తాడు. ఆ క్రమంలో అతను సూర్యకాంతం ( స్వాతి రెడ్డి ) అనే అమ్మాయిని కలుసుకుంటాడు. ఆ పై వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరకు గాంధీ కల తీరిందా, సూర్యకాంతం ఏమైంది అన్నడే మిగిలిన కథ…

విశ్లేషణ…

మణికంఠన్ జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు. విజయ్ సేతుపతి తన నటనతో ఈ మధ్య కాలంలో తమిళ ప్రజల హృదయాల్ని కొల్లకొడుతున్న నటుడు. ఈ ఇద్దరు చేసిన సినిమా రీమేక్ ని రక్షిత్ అనే కొత్త కుర్రోడు హీరోగా, సక్సెస్ రుచి చూడని దర్శకుడు బి. చిన్నికృష్ణ దర్శకత్వంలో మారుతి నిర్మాతగా చేస్తున్నాడు అనగానే ఎక్కడో చిన్న అనుమానం. ఇంకోసారి తన పేరు, బ్రాండ్ తో మారుతి సినిమాకు బిజినెస్ చేద్దాం అనుకున్నాడా అని అనిపిస్తుంది సినిమా మొదటి పావుగంట చూడగానే. అసలు ఈ సినిమా కథ ఎటు వెళుతుందో అన్న అయోమయం కూడా కలుగుతుంది. అయితే అదంతా దర్శకుడు ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అని అలీ క్యారెక్టర్ రావడంతో అర్ధం అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ తో కథని నడిపిన విధానం, సెకండ్ హాఫ్ లో సెంటి మెంట్ పిండిన వైనం చూస్తుంటే చిన్నికృష్ణ అంతకుముందు ప్లాప్ సినిమాలు తీసాడంటే ఒప్పుకోలేరు. ఓ చిన్న కథని అతను నడిపిన తీరు అద్భుతం. కధలో ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది. కధకి ఉపయోగపడుతుంది. సినిమా చూసాక ఏ ఒక్క క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదనే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అంశంలో అంతా టైట్ గా ఉండేలా ప్లాన్ చేశారు చిన్నికృష్ణ. ఆయనే రాసిన డైలాగ్స్ చాలా చోట్ల మనకు మన, మనిషి లోతులను చూపిస్తాయి.

ఈ సినిమా ఇంత బాగా రావడంలో దర్శకుడికి ఎంత ప్రాధాన్యత వుందో, నటీనటులకు కూడా అంతే ఇంపార్టెన్స్ వుంది. హీరో రక్షిత్ కొత్త వాడైనా మంచి నటన కనబరిచాడు. ఒకటిరెండు సందర్భాల్లో తప్పితే అతను వెండితెరకు కొత్త అన్న విషయం గుర్తుకు రాదు. ఇక హీరోయిన్ స్వాతి సూపర్బ్ గా చేసింది. ఆమెను తెలుగు పరిశ్రమ ఎందుకు గుర్తించడం లేదో అనిపిస్తుంది. అలీ క్యారెక్టర్ ఈ సినిమాకే హైలైట్. మురళీశర్మ, సత్య, జీవా, అజయ్ ఘోష్, ధనరాజ్, ప్రియదర్శి, వేణు, రాజా రవీంద్ర, సత్య కృష్ణన్ ఇలా అందరి పేర్లు చెప్పడం రొటీన్ అనిగానీ అతి అని గానీ అనిపిస్తుంది. కానీ లండన్ బాబులు లో వీళ్ళ యాక్టింగ్ చూసాక చెప్పే దాంట్లో ఏ అతిశయోక్తి లేదని తెలుసుకుంటారు. శ్యామ్ కె నాయుడు ఫోటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ .

ప్లస్ పాయింట్స్ …
కథ
కధనం
నటీనటులు
దర్శకత్వం , డైలాగ్స్

మైనస్ పాయింట్స్ …
భూతద్దం వేస్తే ఏమో గానీ మాములుగా కనిపించలేదు.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … ”లండన్ బాబులు “ అబ్బా ఈ తరం కుర్రోళ్ళు అనిపించారు.
తెలుగు బులెట్ రేటింగ్ … 3 .5 / 5 .