పాదయాత్రతో జగన్ ముందు సరికొత్త సవాళ్లు.

new targets for ys jagan padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పాదయాత్ర మొదలు పెట్టబోయే ముందు వైసీపీ అధినేత జగన్ మీడియాలో దానికి తగిన ప్రాధాన్యం రావడం కోసం గట్టి ప్రయత్నమే చేశారు. ఎన్నడూ లేనిది తెలుగు మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థల యజమానులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తానే నేరుగా వెళ్లి ఈనాడు సంస్థల అధినేత రామోజీని కలిశారు. ఆంధ్రజ్యోతి విషయంలో మాత్రం జగన్ పాత వైరాన్ని కొనసాగించారు. అయితే ఈ రెండు ప్రయోగాలు కూడా ఫలితం ఇవ్వలేదు. రెండు వారాలైనా గడవక ముందే జగన్ పాదయాత్ర వార్తలు ఆ రెండు పత్రికల్లో ఎక్కడో లోపలికి వెళ్లిపోయాయి. జగన్ వార్త సైజు కూడా అంతకంతకు తగ్గిపోతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి లో వార్తల సైజు మాత్రమే కాదు అధికారపక్షం నోటి నుంచి విమర్శలు తగ్గాయి. జగన్ పాదయాత్ర మీద మొత్తంగా స్పందించడమే తగ్గిపోయింది.

jagan

సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా జగన్ పాదయాత్ర కి విపరీతమైన మైలేజ్ రాకుండా జాగ్రత్తపడుతున్నారు. జగన్ పాదయాత్రలో చేసే విమర్శలకు చంద్రబాబు అసెంబ్లీ లో గానీ , బయట గానీ నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. పాదయాత్ర ప్రస్తావన రాకుండా చూసుకుంటున్నారు. తప్పనిసరి అనుకుంటే పాదయాత్ర మీద పరోక్షంగా చురకలు వేస్తున్నారు. పార్టీ ముఖ్య నేహలకు కూడా జగన్ పాదయాత్ర విషయంలో ఇలాగే వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అందుకే పాదయాత్ర మొదలు అయినప్పుడు ధారాళంగా విమర్శలు కురిపించిన దేశం నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

jagan-mohan
ఈ పరిణామాన్ని వైసీపీ అధినేత జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. తనపై అధికార పార్టీ విమర్శలు కురిపిస్తేనే పాదయాత్ర రక్తి కడుతుందని ఆయనకు తెలుసు. కానీ అదే జరగడం లేదు. ఈ పరిస్థితి మార్చడానికి కాస్త దూకుడుగా చంద్రబాబు మీద నోరు పారేసుకుందామంటే నంద్యాల అనుభవం గుర్తుకు వస్తోంది. ఆ ఫలితం చేసిన డామేజ్ తో జగన్ దూకుడుగా మాట్లాడలేకపోతున్నారు. ఇక పాదయాత్ర చేయడంలో ఎదురు అవుతున్న ఆరోగ్య సమస్యలు గురించి చెప్పే పనిలేదు. తీవ్రమైన వెన్ను నొప్పితో ముందుకు వెళుతున్నా దానికి ప్రచారం తీసుకురావడంలో కూడా వైసీపీ ఫెయిల్ అవుతోంది. పైగా టీడీపీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి ప్రతికూలంగా తీసుకెళుతోంది. చంద్రబాబు 60 ఏళ్ళు దాటాక కూడా పాదయాత్ర చురుగ్గా చేస్తే, జగన్ అప్పుడే డీలా పడుతున్నారని ప్రచారం చేస్తోంది. ఇలా అన్ని రకాలుగా పాదయాత్ర జగన్ కే సరికొత్త సవాళ్లు విసురుతోంది.

jagan-padayatra