గోపీచంద్ గా సుధీర్ బాబు?

Sudheer Babu wants to play badminton coach Pullela Gopichand

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశంలో ఇప్పుడు బ‌యోపిక్ ల ప‌ర్వం న‌డుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితం ఆధారంగా వ‌రుస‌గా సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్, క్రికెట‌ర్లు స‌చిన్, ధోనీ బ‌యోపిక్ లు ఇప్ప‌టికే బాలీవుడ్ లో విజ‌యాల‌ను అందుకోగా ప్ర‌స్తుతం బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిలు సైనా నెహ్వాల్, పి.వి. సింధు జీవిత‌కథ‌లు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. బ్యాడ్మింట‌న్ లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోన్న సైనా, సింధులిద్ద‌రూ పుల్లెల గోపీచంద్ శిష్యురాళ్ల‌న్న సంగ‌తి తెలిసిందే.

Sudheer-Babu--play---Gopich

శిష్యురాళ్ల‌పై సినిమాలు వ‌స్తుండ‌డంతో… కోచ్ జీవితాన్నీ తెర‌కెక్కించాల‌ని బాలీవుడ్ భావిస్తోంది. గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అబండ‌న్టియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా గోపీచంద్ బ‌యోపిక్ ను నిర్మిస్తున్నాయని సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించాడు. సినిమాకు సంబంధించిన మ‌రిన్ని సంగ‌తుల‌ను ఆయ‌న ట్విట్ట‌ర్ లో పంచుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని, హిందీ, తెలుగు భాష‌ల్లో సినిమా తెర‌కెక్కుతుంద‌ని తెలిపారు. గ‌రుడ‌వేగ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు. 2018 మే నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే ఈ సినిమాలో గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

sudheer-babu