ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మ్యాడ్‌’ .. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే ..?

Cinema News

పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్‌ బావమరిది నార్నె నితిన్‌, సంతోశ్ శోభన్ తమ్ముడు సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్‌, గోపికా ఉద్యాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మ్యాడ్. యూత్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ సినిమాకు కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబరు 6వ తేదీన థియేటర్లలో విడుదలై యూత్​ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మ్యాడ్‌’ .. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే ..?
MAD Movie

ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్​ఫ్లిక్స్​లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో నవంబరు 3వ తేదీ మ్యాడ్ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ‘మీ అందరికీ ఒక శుభవార్త’ అంటూ సదరు సంస్థ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది.