ఎన్టీఆర్‌ బయోపిక్‌పై ‘మహానటి’ దర్శకుడు కామెంట్‌

Director Nag Ashwin comments on NTR BioPic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి మొదట ఎంపిక అయిన దర్శకుడు తేజ తప్పుకోవడంతో మరో దర్శకుడిని ఎంపిక చేసే పక్రియ జరుగుతుంది. త్వరలోనే దర్శకుడి ఎంపిక పూర్తి చేసి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అతి త్వరలోనే దర్శకుడిని ఖరారు చేస్తామని తాజాగా బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీయకుంటే బాగుంటుందనే అభిప్రాయంను మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వ్యక్తం చేశాడు.

తాజాగా ‘మహానటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్‌ అశ్విన్‌ సినిమా విడుదలకు ముందు మీడియాతో మాట్లాడుతూ గొప్ప వారి ఆటో బయోగ్రఫీ తీస్తే బాగుంటుంది. తప్పకుండా వారి జీవితంను అంతా తెలుసుకుంటారు. అయితే వారి బయోగ్రఫీని మూడు గంటల్లో చూపించడం చాలా కష్టం అవుతుంది. తాను సావిత్రి జీవిత చరిత్రను మూడు గంటల్లో చూపించేందుకు చాలా ఇబ్బంది పడ్డాను. ఎన్నో ముఖ్యమైన సంఘటనలు, ఆమె జీవితంలో కీలక పరిణామాలను చూపించలేక పోయాను. అందుకే మహానుభావుల జీవిత చరిత్రలను సినిమాలుగా కాకుండా వెబ్‌ సిరీస్‌లుగా తెరకెక్కిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ ఇంకా ఇతర స్టార్స్‌ జీవిత చరిత్రలున వెబ్‌ సిరీస్‌లో అయితే మొత్తం చూపింవచ్చు అనేది ఆయన అభిప్రాయం.