స్టూడెంట్‌గా మహేష్‌… ఫలితం…!

Mahesh Babu As Student In Maharshi Movie

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్వినిదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘భరత్‌ అనే నేను’ చిత్రం తర్వాత మహేష్‌ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్‌ చాలా గెటప్‌లో దర్శణమివ్వబోతున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. వాటిల్లో స్టూడెంట్‌గా కూడా మహేష్‌ అలరించబోతున్నట్టు సమాచారం. స్టూడెంట్‌ టీజర్‌ను యూనిట్‌ సభ్యులు విడుదల చేయగా అందుకు మంచి స్పందన వస్తోంది. స్టూడెంట్‌ లుక్‌లో మహేష్‌ బాగున్నాడు.

maharshi

అయితే ఆ పాత్ర ఏ నేపథ్యంలో ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సూపర్‌స్టార్‌ స్టూడెంట్‌ పాత్ర అనగానే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేపుతోంది.స్టూడెంట్‌గా మహేష్‌ తొలినాళ్లలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. గతకొంత కాలంగా మహేష్‌ ఇలాంటి పాత్రు చేయడం లేదు. తాజాగా స్టూడెంట్‌ పాత్ర చేయబోతున్నాడు అనడంతో స్టూడెంట్‌గా మహేష్‌ ఆసక్తిగానే ఉంది కానీ ఈ చిత్రంలో మహేష్‌ అయిదారు గెటప్‌లలో కనిపించనున్నాడు. దాంతో స్టూడెంట్‌ పాత్రకు స్కోపు ఉంటుందా? లేదా అనేది క్లారిటీ లేదు. స్టూడెంట్‌గా మహేష్‌ లుక్స్‌ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్‌ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేష్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

Reshoot In Maharshi Movie