ఆ ప్రమోషన్‌ అక్కర్లేదన్న మహేష్‌

mahesh-babu-not-interested-in-spyder-movie-promotion-in-bigg-boss-house

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు దసరా కానుకగా ‘స్పైడర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించాడు. మహేష్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేశారు. తెలుగు మరియు తమిళంలో భారీగా ఖర్చు చేసి మరీ పబ్లిసిటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక స్పైడర్‌ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మహేష్‌బాబు బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

బిగ్‌బాస్‌ ఇంట్లోకి మహేష్‌బాబు వార్తలపై క్లారిటీ వచ్చింది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయమై స్పందిస్తూ తమను బిగ్‌బాస్‌ మార్కెటింగ్‌ విభాగం వారు కలవడం నిజమే, అయితే మహేష్‌బాబు బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లేందుకు ఆసక్తిగా లేడు అంటూ తాము వారికి సమాధానం చెప్పినట్లుగా చిత్రయ ఊనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కారణంగానే మహేష్‌బాబు బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు అంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే స్పైడర్‌కు భారీగా పబ్లిసిటీ దక్కింది. ఇంకా పబ్లిసిటీ కోసం బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని మహేష్‌ అభిప్రాయ పడ్డాడట.