మహేష్‌ అంతటి సాహసం చేయాలంటే..!

Mahesh Babu to Act In Sandeep Reddy Vanga

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత సంవత్సరం టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘అర్జున్‌ రెడ్డి’ చిత్ర దర్శకుడితో మహేష్‌బాబు ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. మహేష్‌బాబుకు అర్జున్‌ రెడ్డి చిత్ర దర్శకుడు సందీప్‌ వంగ ఒక కథను చెప్పాడని, ఆ కథ బాగా నచ్చడంతో మహేష్‌ వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. అయితే కాస్త సమయం కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి అయ్యింది. త్వరలో తన 25వ చిత్రంలో నటించబోతున్నాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు 25వ చిత్రం తెరకెక్కబోతుంది. ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ త్వరలో ప్రారంభం కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘భరత్‌ అను నేను’ మరియు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న చిత్రాు సక్సెస్‌ అయితే సందీప్‌ వంగ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది. సందీప్‌ వంగ చెప్పన కథలో హీరో పాత్ర మెకానిక్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ రెండు చిత్రాలు సక్సెస్‌ అయితే ఖచ్చితంగా సందీప్‌ దర్శకత్వంలో నటించాలనే నిర్ణయానికి మహేష్‌బాబు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్‌లో మహేష్‌బాబు ‘భరత్‌ అను నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో వైపు సందీప్‌ వంగ పలు చిత్రాలను కమిట్‌ అవుతూ ఉన్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మహేష్‌బాబు, సందీప్‌ వంగల చిత్రం వచ్చే సంవత్సరం చివర్లో కాని, 2020లో కాని ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.