బన్నీ ప్రశంసతో ప్రియా ఫిదా

Priya warrior says thanks to Allu Arjun

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత వారం రోజులుగా ఇండియా నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి పెట్టి చూస్తున్న విషయం ప్రియా వారియర్‌ కన్నుసైగ, ముద్దుగన్‌. కనుసైగతో దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్న ఈ అమ్మడు స్టార్స్‌ మరియు సూపర్‌ స్టార్స్‌ దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ అమ్మడి కన్నుగీటే వీడియోను అల్లు అర్జున్‌ మూడు రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరో ప్రియా వారియర్‌ వీడియోను పోస్ట్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆమె వీడియో ఏ స్థాయిలో వైరల్‌ అయ్యిందో బన్నీ షేరింగ్‌తో తేలిపోయింది. మలయాళ ఒరు అదార్‌ లవ్‌ చిత్రంలోని ఆ పాట దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. మలయాళంలో మంచి క్రేజ్‌ ఉన్న బన్నీ ప్రియా వారియర్‌ వీడియోను షేర్‌ చేయడంతో ఆమె సంతోషానికి అవదులు లేవు.

మలయాళంలో మోహన్‌లాల్‌, మమ్ముటిల స్థాయిలో అల్లు అర్జున్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెల్సిందే. బన్నీ ప్రతి తెలుగు సినిమా కూడా అక్కడ డబ్బింగ్‌ అవుతూ కోట్లు కొల్లగొడుతూ ఉంది. భారీ స్థాయిలో బన్నీకి ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక ప్రియా వారియర్‌ కూడా బన్నీకి వీరాభిమాని అంటా.. తాజాగా ఆ విషయాన్ని స్వయంగా ప్రియా వారియర్‌ చెప్పుకొచ్చింది. తాను ఎంతో ఇష్టపడే అల్లు అర్జున్‌ నా వీడియోను షేర్‌ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు కృతజ్ఞతలు అని, ఆయనతో వీలుంటే కలిసి నటించేందుకు సిద్దం అంటూ పేర్కొంది. మొత్తానికి ప్రియా వారియర్‌ బన్నీ మనసునే కాదు యావత్‌ భారత్‌ యువత మనసును గెలికేసింది.