ఇదీ మహేష్‌బాబు క్రేజ్‌ …భరత్‌ అను నేను వరల్డ్‌ రికార్డు

Mahesh Bharath Anu Nenu Teaser All Time World Record In Youtube Likes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘భరత్‌ అను నేను’ చిత్రం వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా సాధించని రికార్డును ఈ చిత్రం సొంతం చేసుకుంది. కేవలం తెలుగు సినిమాలకే కాదు బాలీవుడ్‌ సినిమాలకు కూడా ఇంతటి రికార్డు దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే నెం.2 స్థానంను భరత్‌ అను నేను చిత్రం టీజర్‌ దక్కించుకుంది. 

యూట్యూబ్‌లో వ్యూస్‌ పరంగా ఇటీవల భారీ రికార్డులను ఇండియన్‌ సినిమాలు నమోదు చేశాయి. అయితే లైక్స్‌ పరంగా మాత్రం బాలీవుడ్‌ సినిమాల స్థాయిని దాటి సౌత్‌ సినిమాలు వీర విహారం చేస్తున్నాయి. భరత్‌ అను నేను టీజర్‌ విడుదలైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 6.4 లక్షల లైక్స్‌ను దక్కించుకుంది. నెం.1 స్థానంలో విజయ్‌ చిత్రం ‘మెర్షల్‌’ ఉంది. ఆ చిత్రం ఏకంగా 10 లక్షల లైక్స్‌ను యూట్యూబ్‌లో దక్కించుకోవడంతో ప్రపంచ నెం.1 స్థానంలో ఉంది. ప్రస్తుతం 6.4 లక్షల లైక్స్‌తో మహేష్‌బాబు వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. రెండు సౌత్‌ సినిమాలు యూట్యూబ్‌లో వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకోవడం అద్బుతంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. లైక్స్‌, వ్యూస్‌ మాత్రమే కాకుండా కలెక్షన్స్‌ కూడా రికార్డు స్థాయిలో రావడం ఖాయం అంటూ మహేష్‌బాబు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇదీ మహేష్‌బాబు క్రేజ్‌ ...భరత్‌ అను నేను వరల్డ్‌ రికార్డు - Telugu Bullet