ఇక నో డౌట్‌.. గుమ్మడికాయ కొట్టేశారు

bharath anu nenu movie release date fix another time

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కైరా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భరత్‌ అను నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న విడుదల చేయబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో సినిమా విడుదల అవ్వడం కష్టమే అంటూ ప్రచారం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక పాటను స్పెయిన్‌లో చిత్రీకరణ జరిపారు. స్పెయిన్‌లో చిత్రీకరణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, దాంతో సినిమా అనుకున్నట్లుగా ఈనెల 20న విడుదల అవ్వడం అనుమానమే అంటూ సినీ వర్గాల్లో కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని తాజాగా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయడంతో సినిమా విడుదల ఆగదని తేలిపోయింది.

స్పెయిన్‌ షెడ్యూల్‌ పూర్తి చేశామని, ఈనెల 7న ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆడియో వేడుక అయిన వెంటనే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. ఈనెల 15 వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి అవుతాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొదటి నుండి చెబుతూ ఉన్నట్లుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20 ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేసి తీరుతాం అంటూ నిర్మాతలు ప్రకటించారు. రంగస్థలంను మించిన విజయాన్ని భరత్‌ అనే నేను అందుకుంటుందని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. వేసవి కానుకగా రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి అంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.