నడిరోడ్డుపై కిరాతకంగా హతమార్చారు

నడిరోడ్డుపై కిరాతకంగా హతమార్చారు

భాగ్యనగరంలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తికి కిరాతకంగా హతమార్చారు దుండగులు. కారును వెంబడించి ఆపి.. కారులో నుంచి బయటికి లాగి మరీ దారుణంగా నరికి చంపారు. పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్టలో ఈ ఘటన జరిగింది. నడిరోడ్డుపై కత్తులతో నరకడం చూసి జనం భయభ్రాంతులకు గురయ్యారు. చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు వెళ్తున్న కారును కొందరు దుండగులు అడ్డుకున్నారు.

ఒక్కసారిగా కారులో ఉన్న వ్యక్తిపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. కారులో నుంచి బయటికి లాగి కత్తులతో నరికేశారు. నడిరోడ్డుపై దారుణాన్ని చూసి జనం భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు తెలుస్తోంది. రద్దీ రోడ్డుపై దారుణ హత్య జరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.