ప్రియుడితో కూతురిని రేప్ చేయించి, ముక్కలుగా నరికి చంపిన తల్లి !

rape case

కంటికి రెప్పలా చూసుకోవలసిన ఆ తల్లే కూతురి పాలిట శాపం అయింది. ఆ తల్లి తన ప్రియుడితో కలిసి కూతురిని రేప్ చేయించడమే కాక ఆమెను ముక్కలు ముక్కలుగా నరికించిన ఘటన పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సారా ప్యాకర్‌ అనే మహిళ పిల్లలను దత్తత ఇచ్చే అధికారిణిగా పనిచేసేది. ఈ సందర్భంగా సారా, ఆమె భర్త డేవిడ్‌లు కావాలనే అనాథ పిల్లలను దత్తత తీసుకునేవారు. ఆ పిల్లల మీద లైంగిక దాడులకు పాల్పడేవారు. 2007లో దత్తత తీసుకున్న గ్రేస్ (14) అనే చిన్నారితో డేవిడ్ తప్పుగా ప్రవర్తిస్తే పోలీసులకు ఆ పాపా కంప్లైంట్ చేయగా అతన్ని అరెస్టు చేశారు. దీంతో సారా కూడా ఉద్యోగం కోల్పోయింది. అప్పటి నుంచి గ్రేస్ మీద సారా కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో సారాకు 2013లో జాకబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడితో సహజీవనం చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా గ్రేస్‌ను హత్య చేయాలని జాకబ్‌ను కోరింది. 2016లో ఆమెను ఇంట్లోని మూడో అంతస్థు పైకి తీసుకెళ్ళి తల్లి సారా ఎదురుగానే గ్రేస్‌ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు జాకబ్. నొప్పికి అరుస్తుందనే కారణంతో మత్తు మందు ఇచ్చి ఇచ్చారట. అత్యాచారం సమయంలో గ్రేస్ తల్లిని ఎంతో బతిమాలుకుందని, ఇందుకు సారా.. ‘నీ జీవితం ఇకపై అంతే’ అని సమాధానం తెలిపిందని.. జాకబ్ పోలీసుల విచారణలో చెప్పాడు. అత్యాచారం తర్వాత ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆమెకు మెళకువ వచ్చి కేకలు పెట్టకుండా ఆమె నోటిలో బంతిని కుక్కి నోరు కట్టేశారు. ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేశారు. దీంతో ఎండకు ఆమె చనిపోతుందని భావించారు. అయితే, తర్వాత తిరిగి వచ్చేసరికి ఆమె బతికే ఉండగంతో పీక నులిమి చంపేసి అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు చేసి నగరం శివారులో పడేశారు. అనంతరం సారా తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులకు సారాపై అనుమానం కలిగి తమదైన శైలిలో విచారణ జరిపేసరికి నిజాలు బయటకి వచ్చాయి.