మంచు విష్ణు ‘కన్నప్ప’ లో పార్వతి దేవిగా బాలీవుడ్ నటి ?

మంచు విష్ణు ‘కన్నప్ప’ లో పార్వతి దేవిగా బాలీవుడ్ నటి ?
Cinema News

విష్ణు మంచు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా సినిమా కన్నప్ప. ఈ సినిమా లో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో మోహన్ బాబు, శివరాజ్ కుమార్, రాధికా, బ్రహ్మానందం, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్న శివ పార్వతుల పాత్రల్లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం శివుని గా ప్రభాస్ నటించనుండగా పార్వతి దేవి పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించనున్నట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయట. ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు కన్నప్ప మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.