మారుతికి మెగా ఛాన్స్‌

maruthi next movie with sai dharam tej after naga chaitanya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘భలే భలే మగాడివోయ్‌’ మరియు ‘మహానుభావుడు’ చిత్రాల తర్వాత మారుతి స్థాయి అమాంతం పెరిగింది. అందుకే ఈయన దర్శకత్వంలో నటించేందుకు పలువురు యువ హీరోలు ఆసక్తి చూపుతున్నాడు. కాని ఈయన మాత్రం మెగా ఆఫర్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అల్లు అర్జున్‌తో చాలా కాలంగా ఒక సినిమా చేయాలని ఆశపడుతున్న ఈయనకు తాజాగా ఆ ఛాన్స్‌ దక్కలేదు కాని, మెగా ఆఫర్‌ మాత్రం దక్కినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘శైలజరెడ్డి అల్లుడు’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మారుతి ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఇటీవలే ‘ఇంటిలిజెంట్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డ ఈ మెగా హీరో ప్రస్తుతం కరుణాకరన్‌ దర్శకత్వంలో తేజ్‌ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఇటీవలే ప్రకటించారు. ఇక ఈ చిత్రం తర్వాత మారుతి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. సాయి ధరమ్‌ తేజ్‌కు ప్రస్తుతం వరుస సక్సెస్‌లు కావాలి. అందుకే మారుతి దర్శకత్వంలో చిత్రాన్ని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ భారీ అంచనాల నడుమ చేస్తున్న తేజ్‌ సినిమా సక్సెస్‌ అయితే మారుతి సినిమాపై మంచి అంచనాలుండే అవకాశం ఉంది. ఇక నాగచైతన్యతో మారుతి చేస్తున్న శైలజ రెడ్డి అల్లుడు కూడా ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది.