తమిళ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ చిత్రం ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాస్టర్’ 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. దీంతో రూ. 200 కోట్ల క్లబ్‌లలో చేరిన విజయ్ చిత్రాలలో ‘మెర్సల్’ (అదిరింది), ‘సర్కార్’,‘బిగిల్’ (విజిల్)ల తర్వాత ఇప్పడు ‘మాస్టర్’ నాలుగో చిత్రంగా నిలిచింది.
కాగా తమిళ, తెలుగు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బ్లస్టర్‌గా నిలిచిన ‘మాస్టర్’ మూవీ ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతికి సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ మూవీ విడుదలైన 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల కావడం గమనార్హం. ఈ వార్త విన్న డిజిటల్ ప్లాట్‌ఫాం ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. ట్రేడ్ వర్గాలు మాత్రం దీని ప్రభావం కలెక్షన్ల మీద పడే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేస్తున్నాయి.