మత్తు వదిలింది… రొటిన్ చిత్రాల తుప్పూ వదిలింది..!

మత్తు వదిలింది... రొటిన్ చిత్రాల తుప్పూ వదిలింది..!

రొటిన్ హీరో ఇంట్రడక్షన్.. అతిశయం అనిపించే ఫైట్స్.. హీరో.. హీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్స్, ఐటమ్‌సాంగ్ ఇవన్నీ లేకుండా సినిమా హిట్ అవుతుందా.. ఇలా ఆలోచించే నూతన దర్శకులందరికీ కంటెంట్‌తో రెడీ అవ్వండి.. రొటిన్ ఫార్ములాకు పాతరేసి.. అద్భుతాలు చూపించవచ్చు అని అందరికి తెలియజెప్పిన చిత్రం మత్తువదలరా ఇది కేవలం దర్శకుడు రితేష్‌రానా సాధించిన విజయం కాదు.. కేవలం కథ, కథానాన్ని, దర్శకత్వ ప్రతిభను నమ్మి ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించాలనుకునే ఔత్సాహిక నూతన దర్శకులందరీ విజయం.. ఈ విజయంతో రొటిన్ సినిమాల తుప్పును కొంతైనా వదిలించడు రితేష్‌రానా.. కంగ్రాట్ అండ్ హ్యాట్సాఫ్ టు మైత్రి మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్.. చాలా రోజుల తర్వాత మసాలా దినుసులు లేని ఆర్గానిక్ ఫుడ్ తిన్నంత హాయిగా వుంది..