‘మిడిల్‌క్లాస్‌ అబ్బాయి’ సెన్సార్‌ రిపోర్ట్‌…

MCA Censor Report Gets UA Certificate

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 21న క్రిస్మస్‌ కానుకగా చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది. సెన్సార్‌ వారి నుండి ఈ చిత్రానికి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తప్పకుండా సినిమా నాని మునుపటి చిత్రాల తరహాలో ఆకట్టుకుంటుందని, దిల్‌ రాజు గత చిత్రాల మాదిరిగా భారీ వసూళ్లను సాధిస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

సెన్సార్‌ బోర్డు నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా విభిన్న రీతిలో చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక హన్మకొండలో భారీ ఎత్తున నిర్విహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 25 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను జరుపబోతున్నట్లుగా దిల్‌రాజు ఆఫీస్‌ వర్గాల నుండి సమాచారం అందుతుంది. నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్‌ సినిమా అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం తుది దశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది.