‘ఎంసీఏ’ ప్రివ్యూ

MCA Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   నాని , సాయి పల్లవి , భూమిక , రాజీవ్ కనకాల 
నిర్మాత:  దిల్ రాజు 
దర్శకత్వం :   వేణు శ్రీరామ్ 
సినిమాటోగ్రఫీ:   సమీర్ రెడ్డి 
ఎడిటర్ :  ప్రవీణ్ పూడి 
మ్యూజిక్ : దేవి శ్రీ  ప్రసాద్ 

ఇటీవల కాలంలో తెలుగులో మోస్ట్‌ సస్సెస్‌ఫుల్‌ హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నాని పేరు తప్పకుండా ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లను దక్కించుకున్న నాని ప్రస్తుతం ‘ఎంసీఏ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. నాని చేసే పాత్రలు అన్ని కూడా చాలా సింపుల్‌గా మన పక్కింటి అబ్బాయి లేదా మన జీవితంలో ఎదురయ్యే వ్యక్తుల తరహాలోనే అనిపిస్తాడు. ఇక నాని ఈ చిత్రంలో మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా నటించి మెప్పించబోతున్నాడు. పక్కా ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిగా, యూత్‌ మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే పాత్రను నాని చేసినట్లుగా టీజర్‌ మరియు ట్రైలర్‌లను చూస్తుంటే అనిపిస్తుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. నాని మరియు సాయిపల్లవిల మద్య రొమాన్స్‌ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందని ఇప్పటికే తేలిపోయింది. ఇద్దరు కూడా సహజంగా నటిస్తారు అని పేరు తెచ్చుకున్నారు. ‘ఫిదా’తో ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి మరోసారి ఈ చిత్రంలో తన నటనతో మైమరపించడం ఖాయంగా కనిపిస్తుంది.

నాని, సాయి పల్లవి కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. ఇక ఈ సంవత్సరంలో దిల్‌రాజు నిర్మించిన అయిదు చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇక ఈ చిత్రం ఆరవ సక్సెస్‌ను దిల్‌రాజు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నాని, సాయి పల్లవి, దిల్‌రాజులు తమ సక్సెస్‌ను కంటిన్యూ చేయడం ఖాయం అంటూ ట్రైలర్‌ చూస్తే అనిపించింది. మరి రేపు రాబోతున్న మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు, ఎలా ఒప్పిస్తాడు అనేది చూడాలి.