మీరు అనుకున్న స్థాయికి పవన్‌ వెళ్తాడు : త్రివిక్రమ్‌

trivikram about pawan kalyan at agnathavasi audio event

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో విడుదల వేడుక నిన్న వైభవంగా ఫ్యాన్స్‌ సమక్షంలో భారీ ఎత్తున జరిగిన విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆడియో వేడుక సూపర్‌ హిట్‌ అయ్యింది. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ హాజరు అవ్వడంతో ఎక్కువ శాతం మంది లోనికి హాజరు కాలేక పోయారు. పవన్‌ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ మరింత ఉత్సాహంగా ఈ ఆడియో విడుదల వేడుకకు రావాలని ప్రయత్నించారు. ఇక ఈ ఆడియో విడుదల కార్యక్రమం సందర్బంగా త్రివిక్రమ్‌ అన్న మాటలు పవన్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపాయి.

trivikram

ఇప్పుడిప్పుడే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయంగా ఎదుగుతున్నాడు. పవన్‌కు సీఎం కావాలనే ఆసక్తి, ఆశ లేదు. కాని ప్రతి పవన్‌ ఫ్యాన్‌ కూడా పవన్‌ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. వారి ఆశలు తప్పకుండా తీరుతాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇక ఈ ఆడియో వేడుకలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ పవన్‌ ఈ చిత్రంలో నటన విశ్వరూపం చూపించారని, ఆయన ఇంకా ఎన్నో ఎన్నో చిత్రాలు చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో మీరు పవన్‌ను ఎలా చూడాలని అనుకుంటున్నారో, ఏ స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా పవన్‌ ఆ స్థాయికి వెళ్లాలని తాను కూడా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్‌ మాటలకు పవన్‌ ఫ్యాన్స్‌ కేకలు వేశారు, పవన్‌ మాత్రం చిరు నవ్వు నవ్వాడు.