చెర్రీ బర్త్ డే కు చిరు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?

Mega Star Chiranjeevi Gave Watch As Birth Day Gift To Ram Charan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా వారసుడు రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం చివరిలో ప్రేక్షకులను అలరించేందుకు ఈ రంగస్థలం సిద్దం అయ్యింది. రేపు (మంగళవారం ) పుట్టిన రోజును జరుపుకోబోతున్న చెర్రీ కి తన తల్లిదండ్రులు చిరు-సురేఖ కలిసి ఒక గడియారాన్ని బహుమతిగా ఇచ్చి అడ్వాన్స్ గా విషెస్ తెలియజేశారు.దీనికి సంబందించిన ఒక ఫోటోని చెర్రీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి ‘ముందుగా గిఫ్ట్ ఇచ్చిన అమ్మానాన్నలకు ధన్యవాదాలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసి పోస్ట్ చేశాడు.ఇందులో మెగాస్టార్ భార్య సురేఖ కుడా కనిపించడం విశేషం.

చరణ్ -సుకుమార్ దర్శకత్వం లో సామ్ తో కలిసి నటించిన రంగస్థలం సినిమా ఈ నెల 30 న తెరకెక్కనుంది ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఎన్టీఆర్  తో కలిసి రాజమౌళి  దర్శకత్వం లో మల్టీ  స్టారర్ సినిమా కు సిద్దం అవుతున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా లో మెగా అభిమానులు మరియు చిరంజీవి,  చెర్రి కి  అడ్వాన్సు విషెస్ అందించడం వైరల్ గా మారింది.