మరో భీకరమైన మల్టీ స్టారర్!!

Prabhas and Allu Arjun multistarrer movie In Sukumar Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లతో స్టార్ దర్శకుడైన సుకుమార్ ఒక మల్టిస్టారర్ సినిమా చేయనున్నారు. సుకుమార్ ప్రస్తుతం మెగా హీరో చరణ్ -సమంతల కాంభినేషన్లో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నాడు. ఈ నెల 30 న రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. అల్లుఅర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య సినిమాతో బిజీగా ఉన్నాడు.

దర్శకుడిగా సుకుమార్ కి ఇండస్ట్రిలో మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. కనుక ఈ మల్టీ స్టారర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా రావడం ఖాయం. ప్రస్తుతం రాజమౌళి మెగా నందమూరి కలయికలో ఒక భారీ మల్టీ స్టారర్ తెరకేక్కబోతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు సుకుమార్ మల్టీ స్టారర్ గురించి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా గురించి అధికారికంగా త్వరలోనే తెలియనుంది. సుకుమార్ రంగస్థలం ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మల్టీ స్టారర్ గురించి చిన్న క్లూ ఇచ్చాడు.