ఉయ్యాలవాడపై అంచనాలు పెంచే వార్త

Megastar Chiranjeevi 151 Movie Music Director AR Rahman

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Megastar Chiranjeevi 151 Movie Music Director AR Rahman

మెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమాపై పలు వార్తలు మీడియాలో షికార్లు చేస్తున్నాయి. మొన్నటి వరకు చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ కాదు అంటూ ప్రచారం జరిగింది. వార్తలు పుకార్లే అని ముందు నుండి చెబుతున్నట్లుగా ఆగస్టు నుండి ఉయ్యాలవాడ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లుగా మెగా వర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రస్తుతం దర్శకుడు సురేందర్‌ రెడ్డి ప్రముఖ రచయితలతో కలిసి స్క్రిప్ట్‌ వర్క్‌ను చేస్తున్నాడు. రామ్‌ చరణ్‌ దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా ఈ సినిమాను తమిళం మరియు హిందీల్లో కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో చరణ్‌ ఉన్నాడు. అందుకే సినిమా స్థాయి పెంచేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ లేదా, ప్రముఖ సౌత్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక హీరోయిన్‌తో పాటు సంగీత దర్శకుడి విషయంలో కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మొదట ఈ సినిమాకు థమన్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఏఆర్‌ రహమాన్‌ అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే చరణ్‌ అండ్‌ టీం ఏఆర్‌ రహమాన్‌ను సంప్రదించడం జరుగుతుంది. ప్రస్తుతం పలు బాలీవుడ్‌ సినిమాలతో పాటు తమిళ చిత్రాలను చేస్తున్న రహమాన్‌ భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతో ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఏఆర్‌ రహమాన్‌ మ్యూజిక్‌తో సినిమా స్థాయి ఖచ్చితంగా పెరుగుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులున్నారు. ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకు వెళ్లి వచ్చే సంవత్సరం వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తాలు :

ఫిల్మ్‌ఫేర్‌లో వారికి అవమానం

ఇందుకే పవన్‌తో ఫైట్‌..!