వరుణ్‌ తేజ్‌తో ‘ఘాజీ’ని మించి..!

varun tej and Sankalp reddy movie update revealed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సక్సెస్‌ ఫ్లాప్‌లను పట్టించుకోకుండా వరుసగా చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ‘మిస్టర్‌’ చిత్రంతో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన వరుణ్‌ ఆ తర్వాత వెంటనే ‘ఫిదా’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ‘ఫిదా’తో మంచి పేరు తెచ్చుకున్న వరుణ్‌ తేజ్‌ తాజాగా కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘తొలి ప్రేమ’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాను ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం తొలిప్రేమ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వరుణ్‌ ఉన్నాడు. ‘తొలిప్రేమ’ షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే విడుదల కాకముందే తన తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నాడు.

రానాతో ‘ఘాజీ’ చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్‌ రెడ్డి గుర్తున్నాడు కదా, ఆయన దర్శకత్వంలో వరుణ్‌ ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరో అధికారిక ప్రకటన వచ్చింది. జనవరిలో సంకల్ప్‌ సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నాడు. ఒక సైన్స్‌ ఫిక్షన్‌ కథతో వరుణ్‌ తేజ్‌ హీరోగా సంకల్ప్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తి అయ్యాయి. స్క్రిప్ట్‌ చాలా వైవిధ్యంగా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి సినిమా అయినా కూడా ‘ఘాజీ’తో దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ సినిమాను మించి ఆకట్టుకునే విధంగా దర్శకుడు వరుణ్‌ తేజ్‌తో తన రెండవ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరంలోనే సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశాలన్నాయి.