2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సత్య నాదేళ్ల

2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సత్య నాదేళ్ల

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలను ముమ్మరం చేసింది. అయితే ఈ తరుణంలో ప్రభుత్వానికి పలువురు ప్రముఖులు అండగా నిలుస్తూ తమ వంతు సహాయం చేస్తున్నారు.

అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల సతీమణి అనుపమ భారీ విరాళం ప్రకటించారు. సీఎం సహాయనిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందించారు. అంతేకాదు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల ఒక్క రోజు వేతనాన్ని అనగా 48 కోట్లు సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు. హీరో నితిన్ పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు .

ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెప్సీ)’ సంస్థకు రజనీకాంత్ 50 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే తమిళ హీరో విజయ్‌ సేతుపతి కూడా రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. హీరో శివకార్తికేయన్‌ రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో రూ.10 లక్షల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు అయన తెలిపారు. మిగిలిన రూ.10 లక్షలను సహాయక వస్తువుల రూపేనా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హీరోలు సూర్య, కార్తి కలిపి రూ.10 లక్షలు ఫెప్సికి విరాళంగా ఇచ్చారు.