జలీల్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం !

mla jaleel khan brother son died

 

బీకాంలో ఫిజిక్స్ గా పాపులర్ అయినా జలీల్ ఖాన్ ఇంట తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం జలీల్‌ఖాన్‌ సోదరుడి కుమారుడు గుండెపోటుతో మృతి చెందారు. సోదరుని కుమారుని మృతితో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుటుంబంలో విషాదం నిండిపోయింది. వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జలీల్ ఖాన్ ని ఫోన్ లో పరామర్శించారు. విజయవాడ ఎంపి కేశినేని నాని, స్థానిక వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు మోసిన్ ఖాన్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

mla jaleel khan brother son died

27సంవత్సరాల మోసిన్‌ఖాన్‌ ఆటోనగర్‌లో ఐరన్‌ వ్యాపారం చేస్తున్నారు, ఆటోనగర్ లోని షాప్ లో ఉండగా గుండెల్లో నొప్పి అనిపించడంతో వెంటనే బయలుదేరి సూర్యారావుపేటలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్ళాడు. తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం కూడా తెలియజేశాడు. అయితే, గుండెపోటు తీవ్రంగా రావడంతో కాసేపటికే మృతి చెందాడు. చెట్టంత కొడుకు మృతితో జలీల్ ఖాన్ సోదరుడు షాక్ కు గురయ్యారు. మృతి చెందిన వ్యక్తికి ఇటీవలే పెళ్లవగా ఆరునెలల క్రితమే ఆడపిల్ల జన్మించింది. ఇంతలో ఈ ఘోరం జరగడంతో కుటుంబం అంతా కన్నీటి పర్యంతం అవుతోంది.