అశ్రునయనాల మధ్య…దత్త పుత్రిక చేతిలో వాజపేయి అంత్యక్రియలు

Former Prime Minister Vajpayee Funeral

మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ప్రారంభమైంది. ఈ అంతిమయాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వాజ్ పేయి భౌతికకాయం ఉంచిన వాహనం వెంటే మోదీ నడిచారు. మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నడిచారు. దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రీయ స్మృతి స్థల్ మధ్య దూరం సుమారు నాలుగు కిలోమీటర్లు. వాజ్ పేయి భౌతిక కాయం ఊరేగింపు కార్యక్రమంలో మోదీ సహా అగ్రనేతలు నడుస్తుండటం గమనార్హం.

Former Prime Minister Vajpayee Funeral

అయితే మాజీ ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మేలురకం గంధపు చెక్కల చితిపై వాజ్ పేయి పార్ధివ దేహానికి దత్త పుత్రిక నమిత భట్టాచార్య నిప్పంటించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించారు. వాజ్ పేయి అంతక్రియల్లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రుల రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Former Prime Minister Vajpayee Funeral