ట్రైలర్ తర్వాత “సైంధవ్” పై మరింత క్రేజ్ …!

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామానే “సైంధవ్” మూవీ . మరి మొదటి నుంచి కూడా క్రేజీ బజ్ ని సంతరించుకున్న ఈ మూవీ నిన్న ట్రైలర్ రిలీజ్ వరకు వచ్చింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత సినిమాపై మరింత పాజిటివ్ బజ్ నెలకొనడం విశేషం.

ట్రైలర్ తర్వాత “సైంధవ్” పై మరింత క్రేజ్ ...!
Saindhav Movie

ముఖ్యంగా మూవీ లవర్స్ ని ఈ ట్రైలర్ ఇంప్రెస్ చేయగా దీనితో మూవీ కోసం ఎదురు చూసే వారు మరింత ఎక్కువయ్యారు. దీనితో సైంధవ్ కి వెంకీ మామ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేందుకు హై ఛాన్స్ లు ఉన్నాయని చెప్పడంలో అసలు డౌట్ లేదు. ఇక ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే గ్రాండ్ గా ఈ మూవీ ఈ జనవరి 13న రిలీజ్ కాబోతుంది.