గుంటూరు కారం నుండి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ విడుదల

ఫైనల్ గా “గుంటూరు కారం” నుంచి మీనాక్షి చౌదరి లుక్ రిలీజ్.!
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ మహేష్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ కావడంతో సెన్సేషనల్ హైప్ నెలకొంది. ఇక ఈ మూవీ లో జరిగిన పలు మార్పులు చేర్పుల్లో అయితే యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఒకరు . మరి ఈమె కూడా ఈ మూవీ లో కీలక పాత్ర చేస్తుంది.

మరి ఈమెపై ఇప్పటి వరకు ఇంకా అఫీషియల్ లుక్ అయితే రిలీజ్ కాలేదు. దీనితో ఆమె కోసం వెయిట్ చేసే వారు కూడా చాలా మంది ఉన్నారు . ఇక ఫైనల్ గా అయితే ఇప్పుడు ఆమె లుక్ ని రిలీజ్ చేసేసారు . మహేష్ తో కలిసి ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ని ఆమెపై రిలీజ్ చేసారు. అలాగే ఆమె ఈ మూవీ లో రాజి అనే పాత్రలో కనిపిస్తుంది అని కూడా కన్ఫర్మ్ చేశారు. మరి మూవీ లో త్రివిక్రమ్ మార్క్ తో ఆమె ఎలా కనిపిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.ఫైనల్ గా “గుంటూరు కారం” నుంచి మీనాక్షి చౌదరి లుక్ రిలీజ్.!